పాణ్యం: బీఎల్ఏల జాబితా సమర్పణ, ఎస్‌ఐఆర్ పనులు పూర్తి చేయాలి

పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ఫారం-6, 7, 8 దరఖాస్తులు మరియు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై చర్చించారు. బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) పూర్తి జాబితాను రాజకీయ పార్టీలు సమర్పించాలని సూచించారు. సుమారు 70 శాతం మ్యాపింగ్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన 30 శాతం పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.
