పాణ్యం: వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనపై వైసీపీ ఆందోళన

3చూసినవారు
పాణ్యం: వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనపై వైసీపీ ఆందోళన
నంద్యాల శ్రీనివాస్ సెంటర్‌లో దివంగత మాజీ సీఎం డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటనను నిరసిస్తూ ఆదివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి అసలు కుట్రదారులను గుర్తించాలని డిమాండ్ చేశారు. టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్