పాణ్యంలో ఈనెల 5న ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం

3చూసినవారు
పాణ్యంలో ఈనెల 5న ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం
ఈ నెల 5వ తేదీన పాణ్యం నియోజకవర్గంలో "ఒక నెల - ఒక నియోజకవర్గం - 4 పర్యటనలు" కార్యక్రమంలో భాగంగా నాలుగో పర్యటన నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి గురువారం తెలిపారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు పాణ్యం ఎమ్మెల్యే, సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారు. కల్లూరు, ఓర్వకల్లు మండలాలతో పాటు నగర పరిధిలోని 16 వార్డుల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you