ఎస్. కొత్తూరులో వేడుకగా 4 వేల మందికి సామూహిక వడిబియ్యం

0చూసినవారు
ఎస్. కొత్తూరులో వేడుకగా 4 వేల మందికి సామూహిక వడిబియ్యం
పాణ్యం మండలం ఎస్. కొత్తూరులోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం సామూహిక వడిబియ్యం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో సుమారు 4 వేల మంది మహిళలు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, అధికారులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సంతానం లేని మహిళలకు చీర, బియ్యం అందించి సంతాన లక్ష్మి పూజ నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ విశేష పూజల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :