ఉలిందకొండ: డ్రంకెన్‌ డ్రైవ్‌ దృష్టి పెట్టండి: ఎస్పీ

0చూసినవారు
ఉలిందకొండ: డ్రంకెన్‌ డ్రైవ్‌ దృష్టి పెట్టండి: ఎస్పీ
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, దర్యాప్తుల పురోగతిని సమీక్షించి, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాపర్టీ కేసుల ఛేదన, విజిబుల్ పోలీసింగ్, బాధితులకు తక్షణ సహాయం, స్టేషన్ పరిశుభ్రత, సైబర్ నేరాలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు చంద్రబాబు నాయుడు, గుణశేఖర్ బాబు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్