గురువారం ఓర్వకల్లు మండలంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో నిరసన కార్యక్రమం జరిగింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి, ర్యాలీ నిర్వహించి,
టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీల ప్రతులను దగ్ధం చేశారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.