
వెల్దుర్తి: ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్
శుక్రవారం వెల్దుర్తి మండలంలోని నాగులవాగు వంక ప్రాంతంలో ఉపాధి హామీ పనుల వద్ద వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి. కృష్ణ మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టం గ్రామీణ కార్మికులకు ఎంతో ఉపయోగకరమని, ప్రభుత్వం కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరారు.



































