పత్తికొండ పట్టణంలో శుక్రవారం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా 2కె రన్ పరుగు పందెం నిర్వహించారు. స్థానిక ఇంటర్గ్రేట్ హాస్టల్ విద్యార్థులు, డిఎస్పి వెంకట్రామయ్య, సీఐ జయన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు, ఇవి మానవాళి ప్రగతికి మెట్లు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.