
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావానికి సర్వం సిద్ధం
AP: ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త జోన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు సన్నాహాలు చేస్తోంది. అనుబంధ జోన్లు, డివిజన్ల పరిధిలో ఆదివారం సెలవును రద్దు చేసి, ఉద్యోగులను విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త జోన్ పరిధిలోకి వచ్చే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్ల డీఆర్ఎంలు విశాఖకు వస్తున్నారు. పాలనాపరమైన కార్యకలాపాల కోసం బాలాజీ కిరణ్‌ను సీపీఆర్వోగా నియమించారు.




