పత్తికొండలో బహుజన సేన సమితి నూతన కమిటీ ఏర్పాటు

5చూసినవారు
పత్తికొండలో బహుజన సేన సమితి నూతన కమిటీ ఏర్పాటు
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో బహుజన సేన సమితి నూతన కమిటీని గురువారం ఏర్పాటు చేశారు. మాల మహానాడు నాయకులు బాలముని, నరసన్న ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో, రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నాగేంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సురేంద్ర తాలూకా అధ్యక్షులుగా, బలరాముడు కార్యదర్శిగా, నాగరాజు కోశాధికారిగా, హరిబాబు ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. బహుజన హక్కుల సాధన కోసం పోరాడాలని, మహనీయుల ఆశయాలను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్