పత్తికొండ నియోజకవర్గంలోని క్రిష్ణగిరి మండలం బోయ బొంతరాలలో మంగళవారం కుటుంబ గొడవ హత్యకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న పాపారాయుడు తన భార్య పద్మావతిపై గొడ్డలితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.