పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ త్రివేణి బుధవారం తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పింఛన్ల పంపిణీ నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.