తుగ్గలి మండలంలో అప్పుల బాధతో కాయల శ్రీనివాసులు (46) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం కడమకుంట్లకు చెందిన శ్రీనివాసులు జొన్నగిరిలో 8 ఎకరాల్లో టమాటా తదితర పంటలు సాగు చేశారు. వ్యవసాయ, కుటుంబ అవసరాల కోసం తీసుకున్న రూ. 8 లక్షల అప్పులు తీర్చలేక పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గుత్తికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.