రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరతపై పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్రంలో జరుగుతున్న పాలన పూర్తిగా వైఫల్యానికి దారి తీసిందని ఆమె విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో లేని ఇంధన కొరత మన రాష్ట్రంలో ఏర్పడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. అన్ని పెట్రోలు బంకుల్లో సమృద్ధిగా ఇంధనం అందుబాటులో ఉందని చెప్పడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.