పత్తికొండలో న్యాయవాదుల వినూత్న నిరసన

2చూసినవారు
గంజాయి కేసులో కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని అరెస్ట్ చేసే విషయంలో పత్తికొండ న్యాయస్థాన ప్రాంగణంలో దౌర్జన్యకాండకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు బుధవారం మూడో రోజు వినూత్న నిరసన చేపట్టారు. 'చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు' అంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో విఫలమైన, అక్రమ అరెస్టులో పాల్పడిన ఎస్ఐలపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్