జొన్నగిరి: హెల్మెట్ తప్పనిసరి – భద్రతే ప్రధానం: ఎస్సై

2చూసినవారు
జొన్నగిరి: హెల్మెట్ తప్పనిసరి – భద్రతే ప్రధానం: ఎస్సై
తుగ్గలి మండలం జొన్నగిరి ప్రధాన రహదారిపై బుధవారం ఎస్సై మల్లికార్జున ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మల్లికార్జున మాట్లాడుతూ, ప్రతి వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్