కృష్ణగిరి: టీనేజ్ ప్రెగ్నెన్సీ లను అరికట్టాలి

3చూసినవారు
కృష్ణగిరి: టీనేజ్ ప్రెగ్నెన్సీ లను అరికట్టాలి
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి వైద్య అధికారులను ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బుధవారం కృష్ణగిరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణలను అరికట్టడంపై అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లతో సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా నియంత్రణ, ఎన్‌సీడీ స్క్రీనింగ్, ఫ్రైడే డ్రై డే నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణలను అరికట్టేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్