కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ కర్నూలు, నంద్యాల జిల్లాల మహిళలకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ అందిస్తోంది. సంస్థ డైరెక్టర్ కె. పుష్పక్ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 1 నుంచి 31 రోజుల టైలరింగ్, 35 రోజుల బ్యూటీషియన్ శిక్షణలు ఉచితంగా ఇవ్వబడతాయి. 18 నుంచి 45 ఏళ్ల మహిళలు అర్హులు. శిక్షణ సమయంలో భోజనం, హాస్టల్ వసతి కూడా ఉచితంగా కల్పించబడుతుంది. మరిన్ని వివరాలకు 08518-273710, 90007 10508, 96662 24931, 94409 05477 నంబర్లను సంప్రదించవచ్చు.