కర్నూలు జిల్లాలో రెవెన్యూ సమస్యలకు సత్వర పరిష్కారం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'ఒక నెల - ఒక గ్రామం - నాలుగు పర్యటనలు' కార్యక్రమాన్ని గురువారం నుంచి అమలు చేయనుంది. గ్రామాలను రెవెన్యూ ఫిర్యాదుల రహిత గ్రామాలుగా మార్చడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ప్రతి నెల గురువారం క్షేత్రస్థాయిలో భూసమస్యలను నాణ్యంగా, వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తయిన లేదా భూ సమస్యలు ఎక్కువగా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.