కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, శనివారం జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు, సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించి, పత్తి రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయాధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.