కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, సోమవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాకుండా ముందుగానే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. త్రాగునీరు, శానిటేషన్, వ్యవసాయం, జిఎస్డబ్ల్యూఎస్ సర్వీస్ లు, పిజిఆర్ఎస్ వంటి అంశాలపై కూడా చర్చించారు.