ఇటీవల కురిసిన మొంథా తుఫాను కారణంగా ఓర్వకల్లు మండలంలోని హశేనాపురం, ఓర్వకల్లు, కన్నమడకల, నన్నూరు, పూడిచెర్ల, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ వంటి గ్రామాల్లో పత్తి, మొక్కజొన్న, పొగాకు, కంది, టమోటా పంటలు సుమారు 4,500 ఎకరాల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. గురువారం రైతులు మాట్లాడుతూ, వర్షపు నీరు నిలిచిపోవడంతో మొక్కలు కుళ్లిపోతున్నాయని, దీంతో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని తెలిపారు. అయితే, 15 రోజుల క్రితం వేసిన పప్పు, శనగ పంటలు మొలకెత్తడం రైతులకు కొంత ఊరటనిస్తోంది.