మద్దికేర: అలయం ఆవులు దొంగతనం: సీసీ కెమెరాలో రికార్డ్

6చూసినవారు
శుక్రవారం మద్దికెర పట్టణంలోని మద్దమ్మకుంట సమీపంలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం నుంచి రూ. 1.50 లక్షల విలువైన రెండు ఆవులను దొంగలు అపహరించారు. ఆలయ నిర్వాహకుడు విజయప్రసాద్ యాదవ్ పెంచుతున్న 22 ఆవులలో ఈ రెండు ఆవులను గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. గతంలో ఇదే ప్రాంతంలో గంగమ్మ దేవాలయం నుంచి గుడి గంటలు, రైతుల విద్యుత్ మోటార్లు కూడా దొంగిలించబడ్డాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్