పత్తికొండ పట్టణంలో
ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్యాం బాబు నిర్వహించారు. ఉదయం నుంచి తేరు బజార్ పెద్ద ఆంజనేయ స్వామి దేవాలయం వీధిలో ఆయన పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మైనారిటీలకు పింఛన్లు ఇస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ సామాజిక పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని ఆయన విచారించారు.