పత్తికొండ తుగ్గలి మండలం బొందిమడుగులలో ఎమ్మార్పీఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్‌ను పాతకక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు బుధవారం డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ఒక యువతిని వేధిస్తున్న నిందితుడిపై రమేష్ ఫిర్యాదు చేయడంతో ఈ హత్య జరిగినట్లు సమాచారం. జనవరి 30న రమేష్‌పై ట్రాక్టర్‌తో దాడి చేసి, రాళ్లతో కొట్టి గుంతలో పడేశారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని డీఎస్పీ వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.