పత్తికొండ మండలంలో గురువారం పదో తరగతి ఫలితాల్లో సైన్సులో ఫెయిల్ అయిన 15 ఏళ్ల బాలిక మనస్తాపంతో ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫలితాలు వెలువడిన తర్వాత తీవ్ర నిరాశకు గురైన విద్యార్థిని గదిలోకి వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఎక్కువసేపు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి గది తలుపులు తెరిచి చూడగా, బాలిక మృతి చెందినట్లు గుర్తించారు.