పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ సోమవారం మాట్లాడుతూ, రాష్ట్రంలో తీవ్రమైన ఇంధన సంక్షోభం నెలకొందని, దేశంలో ఎక్కడా లేని విధంగా డీజిల్, పెట్రోల్ దొరకడం కష్టంగా మారిందని తెలిపారు. పలు పెట్రోల్ బంకుల వద్ద "నో స్టాక్" బోర్డులు కనిపిస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం కొరత లేదని చెప్పడం బాధాకరమని విమర్శించారు. ఇంధన వినియోగంపై తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సంక్షోభం రవాణా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆమె పేర్కొన్నారు.