
రేపు సూపర్ మూన్
ఈ ఏడాది తొలి పౌర్ణమి సూపర్ మూన్ శనివారం కనువిందు చేయనుంది. జనవరి 3న సాయంత్రం 6 గంటలకు చంద్రుడు మరింత పెద్దగా కనిపించనుంది. 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు కనిపిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగా చూడవచ్చు. సూపర్ మూన్ను చూడటానికి ఇప్పుడు మిస్ అయితే నవంబర్ వరకు ఆగాల్సిందే.




