మద్దికేరలో విషాదం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

5చూసినవారు
మద్దికేరలో విషాదం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఆదివారం మద్దికేర–నంచర్ల రైల్వే స్టేషన్ల మధ్య రైలులో ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందారు. గుంతకల్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం, సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, అతని గుర్తింపు కోసం పోలీసులు ఆరా తీస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్