శ్రీరంగాపురంలో విషాదం.. వడదెబ్బతో రైతు మృతి

5చూసినవారు
శ్రీరంగాపురంలో విషాదం.. వడదెబ్బతో రైతు మృతి
వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రైతు బాల జయరాముడు (35) వడదెబ్బతో గురువారం మృతి చెందారు. ఈ నెల 27న పొలంలో పనిచేస్తున్నప్పుడు తీవ్ర ఎండ వేడిమికి గురై వడదెబ్బ తగిలింది. ఆరోగ్యం విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్