తుగ్గలి: యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారిగా డా. అమర్నాథ్ నియామకం

0చూసినవారు
తుగ్గలి: యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారిగా డా. అమర్నాథ్ నియామకం
తుగ్గలి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ జి. అమర్నాథ్‌ను కర్నూలు జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకంపై బుధవారం స్పందించిన డాక్టర్ అమర్నాథ్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల్లో యోగా ద్వారా ఆరోగ్య చైతన్యం పెంపొందించడం, నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది, యోగా శిక్షకుల సహకారంతో యోగాంధ్ర కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్