తుగ్గలి: రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి: కంగాటి

1చూసినవారు
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురువారం తుగ్గలి మండలంలోని నునుసురాళ్లలో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి మామిడి తోటలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మామిడి బాక్స్‌కు కనీసం రూ. 2,000 గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ పంట పండించినా రైతులకు సరైన న్యాయం జరగడం లేదని, ధాన్యం రైతులు కూడా తమ పంటను విక్రయించుకోలేని పరిస్థితి నెలకొందని ఆమె మండిపడ్డారు.

ట్యాగ్స్ :