కర్నూలు జిల్లాలోని బొందిమడుగుల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ శుక్రవారం సాయంత్రం వాకింగ్ చేస్తుండగా దుండగులు ట్రాక్టర్‌తో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా, శనివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాయి.