సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ సూచించారు. తుగ్గలి మండలంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నెల రోజుల పాటు గ్రామాలు, పట్టణ వార్డుల్లో ఓటరు జాబితా ప్రక్షాళన జరుగుతుందని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మరింత అప్రమత్తంగా పని చేయాలని పార్టీ నాయకులకు, బీఎల్‌ఏలకు సూచించారు.