తుగ్గలి: ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందవద్దు – సీఐ

1చూసినవారు
తుగ్గలి: ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందవద్దు – సీఐ
పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్ ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు ధైర్యం చెప్పారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా పట్టుదలతో ముందుకు సాగాలని, విఫలం కావడం జీవితం అంతం కాదని, అది కేవలం ఒక దశ మాత్రమేనని ఆయన సూచించారు. విజయం సాధించడానికి అనేక మార్గాలున్నాయని, ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయవద్దని విద్యార్థులకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్