కర్నూలు జిల్లా జేసీ నూరుల్లా ఖమర్ బుధవారం జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల సమస్యలను స్థానికంగానే వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. గుత్తి ఎర్రగుడి, జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల రైతులు భూ సమస్యలు, సర్వే వివాదాలు, పాస్‌బుక్ సమస్యలు, హద్దుల నిర్ధారణ వంటి అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. ఈ వినతులను పరిశీలించిన జేసీ, సంబంధిత అధికారులకు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావేదిక ద్వారా గ్రామస్థాయిలోనే సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.