తుగ్గలి మండలంలోని చెన్నంపల్లి–రామలింగాయపల్లె గ్రామాల మధ్య పెండేకల్–గుత్తి రైల్వే లైన్ సమీపంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, ఇది ఆత్మహత్య లేదా హత్య అనంతరం ఉరివేసి వెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.