వెల్దుర్తిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. సోమవారం, విజయవాడలో జరగనున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మహాధర్నాకు వెళ్తున్న కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షురాలు ఎస్. చాందిని మాట్లాడుతూ, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండలాధ్యక్షుడు మాధవస్వామి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల టీచర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు.