వెల్దుర్తి: హైవేపై ఆటో బోల్తా – ఇద్దరికి గాయాలు

2చూసినవారు
వెల్దుర్తి: హైవేపై ఆటో బోల్తా – ఇద్దరికి గాయాలు
వెల్దుర్తి జాతీయ రహదారి-44పై చెరుకులపాడు క్రాస్ వద్ద బుధవారం తాటి ముంజల లోడ్‌తో వెళ్తున్న ఆటో బోల్తా పడడంతో ఇద్దరు గాయపడ్డారు. కృష్ణగిరి మండలం చిట్యాలకు చెందిన మౌలాలి తాటి ముంజలను ఆటోలో లోడ్ చేసి అమ్మకానికి బయలుదేరగా, లక్ష్మీదేవి అనే మహిళ కర్నూలుకు వెళ్లేందుకు ఎక్కింది. చెరుకులపాడు క్రాస్ వద్ద ఎదురుగా అతివేగంగా వచ్చిన కారును తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మౌలాలి, లక్ష్మీదేవి గాయపడగా, వారిని 108 అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్