వెల్దుర్తి: పెళ్లయిన రెండు నెలలకే రోడ్డు ప్రమాదంలో మృతి

5చూసినవారు
వెల్దుర్తి: పెళ్లయిన రెండు నెలలకే రోడ్డు ప్రమాదంలో మృతి
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చేరుకులపాడుకు చెందిన హరికృష్ణ (25) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పని నిమిత్తం కోడుమూరు మండలం పాలకుర్తికి వెళ్లి తిరిగి వస్తుండగా, అతని బైక్ అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ఘటనలో హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు నెలల క్రితమే వివాహం అయిన హరికృష్ణ మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర దుఃఖాన్ని నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్