వెల్దుర్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం, 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరకులపాడు ప్రదీప్ రెడ్డి ఆవిష్కరించారు. ఎన్నికల హామీల అమలులో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమై ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచిందని నాయకులు ఆరోపించారు. జూన్ 4న నిర్వహించే రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.