తుగ్గలి మండలంలోని పగిడిరాయిలో ఓ మహిళకు వజ్రం దొరికింది. బుధవారం స్థానికుల సమాచారం ప్రకారం, జొన్నగిరికి చెందిన మహిళ రెండు రోజుల క్రితం పొలం పరిశీలనకు వెళ్లినప్పుడు ఈ వజ్రం లభించింది. వజ్రం లభ్యమైన విషయం తెలిసి స్థానికంగా ఆసక్తి నెలకొంది. మంగళవారం రాత్రి అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని రూ. 2 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇటీవల జొన్నగిరి, తుగ్గలి పరిసర ప్రాంతాల్లో ప్రజలు వజ్రాల కోసం పొలాలు, వాగులు వెంబడి అన్వేషణ కొనసాగిస్తున్నారు.