
సున్నిపెంట సమస్యల పరిష్కారానికి నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వినతి
సున్నిపెంటలో ఫైర్ స్టేషన్‌ను పునరుద్ధరించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టు, రేడియాలజిస్టు, అంబులెన్స్, బ్లడ్ బ్యాంక్ సౌకర్యాలు కల్పించాలని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ శ్రీశైలం మండల కమిటీ డిమాండ్ చేసింది. అలాగే ఆర్టీసీ బస్సులు సున్నిపెంట మీదుగా నడపడం, ఫారెస్ట్ మ్యూజియం ఏర్పాటు, హైస్కూల్ గ్రౌండ్‌లోని హెలిప్యాడ్లను తొలగించి యువతకు క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తేవాలని కోరింది. ఈ మేరకు మండల అధ్యక్షుడు వేశపోగు కమలాకర్, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి ప్రసన్న, కోశాధికారి యలమంటి రాజ్‌కుమార్ జిల్లా కలెక్టర్ రాజకుమారి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.





































