కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఆలయ సిబ్బంది వేడి పాలు పంపిణీ చేశారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోందని భక్తులు తెలిపారు.