ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు అంకితభావంతో సేవలు అందించిన ఆత్మకూరు అర్బన్ సీఐ డి. రాముకు ఉత్తమ అవార్డు లభించింది. శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకోవడం తనపై మరింత బాధ్యతను పెంచిందని సీఐ రాము తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాము సేవలను ప్రశంసించారు.