నందవరం దేవస్థానంలో తలనీలాల వేలం జోరు

1చూసినవారు
నందవరం దేవస్థానంలో తలనీలాల వేలం జోరు
బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో తలనీలాల సీల్డ్ టెండర్ వేలం విజయవంతంగా జరిగింది. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా రూ. 3.80 లక్షల ఆదాయం వచ్చింది. తలనీలాల సేకరణ హక్కును ప్రొద్దుటూరుకు చెందిన ఎం. పుల్లయ్య రూ. 9 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది రూ. 5.80 లక్షలు ఉండగా, ఈసారి రూ. 9 లక్షలకు పెరగడం గమనార్హం. ఈ వేలం ద్వారా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం సమకూరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్