మహానందిలో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

5చూసినవారు
మహానంది మండలంలో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్నారు. మండలంలోని ఈద్గాహ్లకు చేరుకున్న ముస్లింలు సామూహిక నమాజ్ నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం మౌలానాలు, మన్నన్లు పండుగ ఆధ్యాత్మిక విశిష్టతను వివరించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్