ఆత్మకూరు సమీపంలోని వైఎస్ఆర్ స్మృతివనం వద్ద ఎలుగుబంటి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. అటవీ ప్రాంతం నుంచి నంద్యాల ప్రధాన రహదారిపైకి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించగా, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.