మహానంది మండలంలోని నందిపల్లె సమీప 12వ బ్లాక్ వద్ద వరద నీటి ప్రవాహం వల్ల కాలువ కోతకు గురైన ప్రాంతాన్ని తెలుగు గంగ డిస్ట్రిబ్యూట్ కమిటీ చైర్మన్ చింతం కాంతి కుమార్ యాదవ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సమస్యను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వెంటనే మరమ్మతులు చేయిస్తామని ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో స్థానిక రైతులు, నాయకులు పాల్గొన్నారు.