శ్రీశైలం నియోజకవర్గం వేల్పనూరులో సోమవారం 48 మంది లబ్ధిదారులకు రూ. 51,06,083 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అందజేశారు. వైద్యం కోసం ఆపదలో ఉన్నవారికి ఈ నిధులు అమూల్యమని, రాజకీయాలకు అతీతంగా అర్హులకే సహాయం అందుతున్నదని ఆయన పేర్కొన్నారు. సకాలంలో చికిత్స కోసం మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.